సాగునీటి కోసం రైతులు కష్టాలు

SKLM: మండల కేంద్రం సారవకోట ఊర చెరువు నుండి దిగువ పొలాలకు వెళ్లే కాలువ పూర్తిగా పాడయింది. ఆ కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను రైతులు మంగళవారం శుభ్రం చేశారు. కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందలేదని, దీనిని కొన్ని సంవత్సరాలుగా మరమ్మత్తులు చేయకపోవడం నీటీకి కష్టమైందని రైతులు పేర్కొన్నారు. ఆ కాలువకు సిమెంట్ కాలువ ఏర్పాటు చేయాలని కోరారు.