VIDEO: నందిగామలో వాహనాల తనిఖీలు
NTR: నందిగామలో ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి హెల్మెట్, లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తున్న 10 మందికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయాల్లో హెల్మెట్ ప్రాణ రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు.