ప్రేమ ఫలించక ఆత్మహత్య
PLD: ప్రేమ.. పెళ్లి వరకు రాకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్వర్ణ భారతి నగర్ వాసి R.మణికంఠరాజు(20), ఓ యువతి(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గత నెల 15న ఆమెకు వివాహం చేయగా, భర్తతో జీవించలేనని ఇంటికి వచ్చింది. ఈ నెల 7న ప్రియుడితో కలిసి కొండవీడుకోటలో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.