దుగ్గిరాల యార్డులో నిలకడగా పసుపు ధరలు

దుగ్గిరాల యార్డులో నిలకడగా పసుపు ధరలు

GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో పసుపు ధరలు స్థిరంగా కొనసాగాయి. క్వింటాల్ పసుపు కొమ్ముల ధర గరిష్ఠంగా రూ.12,200 పలకగా, కనిష్ఠ ధర రూ.9,500గా నమోదైంది. అలాగే కాయ రకం పసుపు రూ.10,011 నుంచి రూ.11,900 వరకు ధర పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. గత వారంతో పోలిస్తే ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలిపారు.