ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ.. గాయాలు

కడప: కాశినాయన మండలం బాలయపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొన్నాయి. ఆ ప్రాంతంలో మలుపు ఉండటం, ఎదుటి వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 104 అంబులెన్స్ ద్వారా పొరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.