కంభంలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

కంభంలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

ప్రకాశం: కంభంలోని ఓ లాడ్జీలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపారు. వారి వద్ద నుండి 6,060/- నగదును స్వాధీనం చేసుకొని స్టేషన్‌కి తరలించామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..