శ్రీరాముని శోభాయాత్రలో బీజేపీ నేత ఏలేటి

శ్రీరాముని శోభాయాత్రలో బీజేపీ నేత ఏలేటి

నిర్మల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.