విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో పూజలు

NLG: ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కాంక్షిస్తూ... నకిరేకల్ విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత జవాన్లకు ఎలాంటి ఆపద కలుగొద్దని ప్రార్థించారు. బాలబాలికలు సుమారు 150 మంది జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకీ జై , జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.