వినాయక మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి

SKLM: ఈ ఏడాది నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆయా కమిటీలు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు పొందాలని సీఐ తిరుపతిరావు, ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం మందస పోలీస్ స్టేషన్‌లో సీఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా నవరాత్రులు నిర్వహించొద్దని పేర్కొన్నారు. అలాగే ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనుమతులు తీసుకోవాలన్నారు.