VIDEO: వినాయక చవితి ఎఫెక్ట్... జోరుగా సాగుతున్న విక్రయాలు

కోనసీమ: వినాయక చవితి పండగను పురస్కరించుకుని రాజోలు నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో వినాయక మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. రాజోలు సెంటర్లో చవితికి సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో రకరకాల విగ్రహాలు, పళ్ళు, పత్రి, అలంకరణ తదితర వస్తువులతో కళకళలాడుతున్నాయి. భక్తులు పండగకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తరలివస్తున్నారు.