మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి వివేక్
MNCL: రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. శనివారం చెన్నూర్‌లోని మైనారిటీ కమ్యూనిటీ హాల్‌లో 360 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు శిక్షణ ఇప్పించి పని కల్పిస్తామని, కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.