నర్సింగ్ కళాశాల విద్యార్థినుల నిరసన
మెదక్ నియోజకవర్గంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు కళాశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.