'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

MNCL: అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ శివారులో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తారని ఆయన తెలిపారు.