ముగిసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన

ముగిసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన

KNR: కొత్తపల్లిలోని ఓ పాఠశాలలో 3 రోజులుగా జరిగిన జిల్లాస్థాయి బాలవైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. జిల్లా విద్యాధికారి శ్రీరాం కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైన్స్ అనేది మానవ జీవితానికి ఉపయోగపడాలి తప్ప వినాశనానికి కాదని అన్నారు. ప్రతివిద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, నూతన ఆవిష్కరణలతో 'ఆత్మనిర్బర్ భారత్' లక్ష్య సాధనకు కృషిచేయాలని సూచించారు.