ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎస్పీ

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎస్పీ

ఏలూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. ఈ పీజీఆర్ఎస్‌లో 46 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు.