శాకంబరీగా పార్వతి దేవి

GNTR: తెనాలి మండలం కొలకలూరులోని పురాతన శ్రీ గంగాపార్వతి సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కొలువైన పార్వతీ దేవి అమ్మవారు శాకంబరీ అలంకరణలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అర్చక స్వాములు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీ దేవిగా అలంకరించారు.