'పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'
ప్రకాశం: కంభం పట్టణంలో జల సురక్ష మాసం కార్యక్రమాన్ని ఎంపీడీవో వీరభద్రచారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అర్బన్ కాలనీలో మంచినీటి ట్యాంక్‌ను సిబ్బంది శుభ్రం చేయించారు. అనంతరం ట్యాంకుల వద్ద పాచి, ముళ్ల కంప, చెత్తను తొలగించి క్లోరినేషన్ చేయించారు. పరిసరాలను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని MPDO కాలనీ వాసులకు సూచించారు.