వెల్టూరులో దెబ్బతిన్న పంటను పరిశీలించిన అధికారులు
NGKL: తుఫాన్ ప్రభావం కారణంగా అచ్చంపేట నియోజకవర్గం వెల్టూరు గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను మండల వ్యవసాయ అధికారి రమేష్, వెల్టూరు క్లస్టర్ ఏఈవో చినియా నాయక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పై అధికారులతో మాట్లాడి పంట నష్టానికి సంబంధించి అంచనాలను పంపిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.