శ్రీ జెండా బాలాజీ ఆలయంలో హుండీలు లెక్కింపు

శ్రీ జెండా బాలాజీ ఆలయంలో హుండీలు లెక్కింపు

NZB: జిల్లా కేంద్రంలోని శ్రీ జండా బాలాజీ దేవస్థానంలో హుండీ లెక్కింపు చేశామని ఈఓ వేణు తెలిపారు. 2నెలల హుండీలు లెక్కింపు చేయగా రూ.96,371/-ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీల లెక్కింపు ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కమల పర్యవేక్షణలో జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ లవంగ ప్రమోద్, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.