మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్స్

మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్స్

HYD: ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ 'టక్కీట్' సహకారంతో మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించింది. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్, ఇతర వ్యక్తిగత వస్తువులను ఇందులో భద్రపరచుకోవచ్చు. మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, LB నగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.