ఆసుపత్రిల దోపిడీ అరికట్టాలని డిమాండ్

ఆసుపత్రిల దోపిడీ అరికట్టాలని డిమాండ్

VZM: కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న డిమాండ్‌ చేశారు. బొబ్బిలిలో మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్తున్న జనాన్ని పరీక్షల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.