బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేత వీరన్న సంతాప సభ

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేత వీరన్న సంతాప సభ

W.G: బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తణుకు పట్టణ కార్యదర్శి వీరన్న సంతాపసభ బుధవారం తణుకులోని యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ పట్టణ అధ్యక్షుడు కె.సత్తిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.