VIDEO: రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి

అన్నమయ్య: మదనపల్లి మండలంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో 29 ఏళ్ల చేనేత కార్మికుడు నాగార్జున దుర్మరణం చెందాడు. మదనపల్లి ఎస్టేట్‌కు చెందిన నాగార్జున, వాల్మీకిపురం మండలం చింతపర్తిలో ఉన్న తన భార్య లావణ్య వద్దకు బైక్‌పై వెళ్తుండగా కాశీరావుపేట హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.