'12A రైల్వే కాలనీ' OTT పార్ట్‌నర్ ఫిక్స్!

'12A రైల్వే కాలనీ' OTT పార్ట్‌నర్ ఫిక్స్!

అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ '12A రైల్వే కాలనీ'. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా దీని OTT పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక 'పొలిమేర', 'పొలిమేర 2' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ మూవీకి కథను అందించాడు.