VIDEO: విశాఖను ముంచెత్తిన వర్షం
VSP: విశాఖ నగరంలో మోంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం తెల్లవారుజాము నుంచీ కుండపోతగా వాన కురిసింది.ఈ భారీ వర్షాల కారణంగా అక్కయ్యపాలెం ప్రాంతంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అక్కడి ప్రధాన కాలువ పొంగి ప్రవహించడంతో వర్షపునీరు భారీగా రోడ్లపై చేరింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి.