గుండె పోటుతో వ్యక్తి మృతి

కడప: గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన వీరపునాయునిపల్లె (M)యు. రాజుపాలెంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓతూరు కుళ్లాయప్ప (50)కి శనివారం రాత్రి ఛాతిలో నొప్పి, ఆయాసం ఎక్కువ అయింది. బాత్ రూమ్‌కి వెళ్లి అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేంపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.