మండల ప్రజలకు ఎంపీడీవో సూచనలు
NLG: వేసవి కాలంలో తీవ్రంగా పెరుగుతున్న ఎండలు మరియు వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో శేషగిరి శర్మ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, బస్టాండ్‌లు మరియు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటలు తాగు నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దన్నారు.