సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం: ఎస్సై
WNP: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై స్వాతి సూచించారు. అమరచింత పట్టణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 90 శాతం నేరాలు మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు పంచుకోవద్దని కోరారు. అలాగే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు.