రేపటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన: చదలవాడ

రేపటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన: చదలవాడ

పల్నాడు: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నరసరావుపేట ప్రజలు లైవ్‌లో వీక్షించేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని టౌన్ హాల్లో చేసిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఐదేళ్లు కష్టాలు అనుభవించిన ప్రజలు రేపటి నుంచి ప్రజాపాలనలో భాగస్వాములు కాబోతున్నారన్నారు.