కిశోరి వికాసం శిక్షణ శిబిరం ప్రారంభం

కిశోరి వికాసం శిక్షణ శిబిరం ప్రారంభం

PLD: ఈపూరు మండలంలోని ముప్పాళ్ళ అంగన్వాడీ కేంద్రంలో కిశోరి వికాసం శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే.చిన్నమ్మాయి మాట్లాడుతూ.. బాలికలు చదువు, చట్టాలు తెలిసిన వారిగా, ధైర్యంగా ఎదగాలని సూచించారు. రుతు శుద్ధి, లైంగిక వేధింపుల నివారణ, బాల్య వివాహాల రోధం, పౌష్టికాహారం, ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు.