కమలాపురంలో భారీ వర్షం ఇదీ పరిస్థితి

MLG: మంగపేట మండలంలో వర్షం దంచి కొడుతోంది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. కమలాపురంలో ఆటో స్టాండ్ నుంచి గ్రామపంచాయతీ పక్కనున్న లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లోకి వరద భారీగా చేరుకుంది. పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. డ్రైనేజీ కూడా లేకపోవడంతో నీరంతా ఇంట్లోకి చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.