'ప్రభుత్వ అధికారులకు సహకరించండి'

'ప్రభుత్వ అధికారులకు సహకరించండి'

BDK: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం ఉదయం ఆయన గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు, ఈతకు వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరారు.