నవరాత్రి ఉత్సవాలకు రాట ప్రతిష్ట

E.G: అనపర్తి మండలం మహేంద్రవాడలోని సబ్బెళ్లవారి వీధిలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేయనున్న కనకదుర్గమ్మ అమ్మవారి మండప పనులకు శనివారం రాట ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా కొమ్మన పెద్దిసాయిబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి పందిరిరాటను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కర్రీ సతీష్ రెడ్డి , సబ్బెళ్ళ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.