గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఇవే.!

కృష్ణా: జిల్లా SP ఆర్.గంగాధరరావు వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనుమతులు తప్పనిసరి, మట్టి విగ్రహాలే వాడాలి, CC కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఏర్పాటు చేయాలి అన్నారు. శాంతి సామరస్య వాతావరణంలో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలి. DJలు, బాణసంచా, శబ్ద కాలుష్యం, రోడ్ల ఆక్రమణలు నిషేధమని తెలిపారు.