నివాస గృహ సముదాయాలు ప్రారంభించిన డీజీపీ
NRML: నిర్మల్ పట్టణంలో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లపల్లి వద్ద నూతనంగా నిర్మించిన డి.ఎస్.పి, ఆర్ ఐ, ఆర్ఎస్ఐల నివాస గృహ సముదాయాన్ని వారు ప్రారంభించారు. అనంతరం నూతన ఎస్పీ క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేశారు. డిజిపి మాట్లాడుతూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని,పోలీసుల గౌరవ ప్రతిష్టలను పెంపొందించాలని సూచించారు.