షాకింగ్.. తల్లి పాలలో యురేనియం

షాకింగ్.. తల్లి పాలలో యురేనియం

బీహార్‌లోని ఓ గ్రామంలో చేపట్టిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలుగుచూశాయి. ఆ ఊరిలోని తల్లుల పాలల్లో రేడియో ధార్మిక పదార్థమైన యూరేనియం మూలకం 5 పీపీబీ ఉన్నట్లు గుర్తించారు. 40 మంది తల్లుల నుంచి పాలు సేకరించగా.. అందరిలోనూ యురేనియం ఉన్నట్లు తెలిపారు. అయితే పాలు తాగుతున్న చిన్నారుల్లో యురేనియం వల్ల వచ్చే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు.