రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VZM: మండలం రీమా పేట సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో స్దానిక వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మృతుడు ఎప్పటిలాగే ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్‌ ఎస్సై వి.అశోక్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.