అందరూ ఉండి అనాథగా మిగిల్చారు..!

అందరూ ఉండి అనాథగా మిగిల్చారు..!

HNK: హసన్‌పర్తికి చెందిన కాసుల కౌసల్య(85) ఆరుగురు సంతానాన్ని కష్టపడి పెంచి పెళ్లిళ్లు చేసి ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా ఇచ్చింది. భర్త మరణం తర్వాత కొంతకాలం చూసుకున్న కుమారులు గత మూడేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. ఆధార్‌, డిపాజిట్ పత్రాలు కూడా కొడుకుల వద్దే ఉన్నాయని, ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరింది.