అదృష్టాన్ని వరించిన టాస్.!
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కేవలం కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మండలం నాగపూర్ 3వ వార్డు అభ్యర్థులు సమానం ఓట్లు దక్కించుకున్నారు. అర్చన, విజయలక్ష్మికి చెరో 30 ఓట్లు రాగా.. దీంతో టాస్ వేయగా విజయలక్ష్మిని అదృష్టం వరించింది. దీంతో ఆమె మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు.