తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.