'కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ విజయానికి పాటుపడాలి'
MBNR: త్వరలో జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగర కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ విజయానికి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.