ఊనగట్లలో రేపు మెగా ఉచిత వైద్య శిబిరం
E.G: చాగల్లు మండలం ఊనగట్లలో సర్వ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఊనగట్ల కొత్తపేట ఏరియాలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అనుభవజ్ఞులైన వైద్యులు వివిధ రకాల ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లిపూడి రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.