రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: మణుగూరు పట్టణ కేంద్రం హనుమాన్ టెంపుల్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.