'ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
JGL: సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమీక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి రాథరెడ్డి అన్నారు. మంగళవారం ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా షుగర్, బీపీ, రక్త, తదితర పరీక్షలను నిర్వహించారు.