VIDEO: ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో గొడవకు దిగిన ట్రాన్స్ జెండర్లు
HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానాలు ఇవాళ కూడా రద్దవడంతో ఎయిర్ పోర్టులో దారుణ పరిస్థితి చోటుచేసుకుంది. వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ఎయిర్ పోర్టులో సిబ్బందితో ట్రాన్స్ జెండర్లు గొడవకు దిగారు. చప్పట్లు కొడుతూ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేశారు.