VIDEO: నకిలీ రైతు బంధు పొందుతున్న వ్యక్తి పై విచారణ
ములుగు జిల్లా మంగపేట మండలంలో భూమి లేకున్నా రైతుబంధు పథకం కింద డబ్బులు పొందుతున్న వ్యక్తిపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయం బయటపెట్టిన వ్యక్తిని అక్రమార్కులు చంపుతామని బెదిరిస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే వారే బాధ్యులని పోలీసులకు ఫిర్యాదు చేశారు.