సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ
AKP: ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన పదిమందికి సీఎం సహాయనిధి కింద రూ.3.50 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎలమంచిలిలో వారికి చెక్కులు అందజేసామన్నారు. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న వారికి తన సిఫార్సు మేరకు సీఎం సహాయనిది మంజూరైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.