మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: కలెక్టర్

మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వయం సహాయక  సంఘాల్లోని 135 మంది ఎస్సీ మహిళలకు రూ. 1.58 కోట్ల విలువైన నమూనా చెక్కును కలెక్టర్ నాగరాణి లబ్ధిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేయూత నిస్తోందని పేర్కొన్నారు. పీఎంఏజేవై పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ వేణుగోపాల్, పాల్గొన్నారు.