సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు
HNK: కాజీపేట మండలం అమ్మవారిపేటలో నిర్వహించిన శ్రీ సమ్మక్క-సారలమ్మ శనివారం ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మొక్కులు చెల్లించుకున్నారు. వర్ధన్నపేట ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం కలగాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా, శాంతియుతంగా వర్ధిల్లాలని అమ్మవార్లను మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.