పుంగనూరులో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
CTR: పుంగనూరు పురపాలక సంఘంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఛైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆయన కోరారు.